KTR: సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలు... 1 d ago
TG : రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారని, సీఎం చెప్పేవన్ని అబద్ధాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని, ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. పత్తి రైతులు, కంది రైతులు మోసపోకండి.. రైతు ఆత్మహత్యలపైనా ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని చెప్పారు. రైతుబంధు మొదలయ్యాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు.